Saturday, August 18, 2007

ఇదా మన దేశం

ఇదా మన దేశం ఇదా మన దేశం
నేతాజీ కలలు కన్న భారత దేశం
శివాజీ ప్రతాపులు పుట్టిన దేశం
నాగరికత విశ్వానికి నేర్పిన దేశం

ప్రతి పనిలొ పెరుగుతున్న అవినీతి
మది మది లొ నిండి ఉన్న అశాంతి
సందు సందులొ లెక్క లేని దొమ్మీలు
ఇంటి ఇంటి లో చెప్పలేని కలహాలు
ఇదా మన దేశం ఇదా మన దేశం

యువతలొ సినిమాల జ్వరం
అనాగరిక వర్తనకది కారణం
పసిపిల్లల చెతులకు పని దాస్యం
అది భావి తరాలకు తీరని ద్రోహం
క్రీడల్లో కనిపించని సమరోత్సాహం
చిన్న గెలుపుతోనే అలసత్వం
దేశ రక్షణ లోనూ వస్తున్న జాడ్యం
ఇది దేశ మాత క్షమించని నేరం
ఇదా మన దేశం ఇదా మన దేశం

కుల మత్తులొ జోగేది కొందరు
మత పిచ్చి లోకంగా కొందరు
ప్రాంత వైషమ్యాలే ఊపిరిగా కొందరు
ఒకే తల్లి బిడ్డలమని ఎపుడు తెలుసుకుంటారు
దేశాన్ని దూషించే ప్రభుధ్ధులు కొందరు
దేశమొదిలి వెళ్ళిపోవు మేధావులు కొందరు
దేశ సేవ బరువని వదిలెసేదెందరో
ఇదా మన దేశం ఇదా మన దేశం

ఇకనైనా నిదుర వదిలి
యువ శక్తి ముందు కదిలి
చేయి చేయి కలిపి నదిచి
దేశమాత రుణం తీర్చి
స్వర్ణ యుగం సాధించి
గర్వంగా చెబుదాము
ఇదే మన దేశం ఇదే మన దేశం
జగద్గురువు మన భారత దేశం

Friday, August 17, 2007

60 years of independence !!!!

ఆరు దశాబ్దాల భారత స్వరాజ్యం
సంబరాలు చేశాము వాడ వాడలా మనం
ఏమిటీ సాధించిన స్వాతంత్ర్యానికి అర్ధం
ఏనాడైనా ఆలోచించామా ఒక్క క్షణం

విభజించి పాలించారని చరిత్ర లో చదివాం
ఈ నాటి రాజకీయానిదీ మరి అదే చందం
ఈ వర్గం ఆ ప్రాంతం ఈ కులం ఆ మతం
ఇవేగా నేటి రాజకీయాల నిజమైన స్వరూపం
విభేదాలు మరచి ఒక్కటయ్యామా మనం

తెల్లవారిని తరిమి కొట్టిన సత్యాగ్రహం
కొత్త పుంతలు తొక్కుతోందిప్పుడు నిజం
విధ్వంసం సృష్ఠించె ఉద్యమాల పర్వం
బందులంటు మొదలైన వింత సంప్రదాయం
ఇదేనా ఇంటి సమస్యలు తీర్చుకునే విధానం

భావ స్వాతంత్ర్యం ఒక గొప్ప వరం
జన జాగృతికీ అభ్యుదయానికీ ఆయుధం
చట్ట సభలలో నాయకుల పదజాలం
విలువలు శూన్యమైన ఈ నాటి జర్నలిజం
ఇదా ఆ హక్కుని వాడుకునే విధానం

పాశ్త్యాత్యపు మోజులో పడి విచ్చల విడి తనం
నేర్చుకున్నాము గానీ త్వర త్వరగా మనం
క్రమశిక్షణ గుణం జవాబు దారి తనం
వారి నుంచి నేర్వగలిగామా మనమందరం
ఇదా మన స్వాతంత్ర్యాన్ని అనుభవించు విధానం

హక్కులకై నినందించే ప్రతి ఒక్క గళం
ఇది బాధ్యతలను గుర్తించాల్సిన తరుణం
ఇదే కదా స్వతంత్ర భారతికి ఈ దినం
మనమందించే వజ్రొత్సవ నీరాజనం
సగర్వంగ ఎగిరేనపుడు మన త్రివర్ణ పతాకం

Friday, July 13, 2007

Ela Edurkondamu Janabha Samasya

నేటి భారతానికి భారమైన సమస్యేమిటా అని
తలచి చూశా నేనేమి చెయ్య గలనా అని
సమస్యల సమాహారం ఎదుట కదలాడగా గని
తరచి చూసా మూలం ఎమిటా అని

పెదరికమా, నిరుద్యోగమా మరి నిరక్షరాస్యమా
కిక్కిరిసిన రోద్లమీద ప్రయాణమా
కాలుష్యంతో పెరుగుతున్న కొత్త రోగాల భయమా
నీరు లేక ఎండుతున్న సామాన్యుడి గళమా
వరకట్న పిశాచమా అవినీతి రాజ్యమా
అన్నింటి వెనకనున్న పెరుగుతున్న జన సంధ్రమా

ఏనాటి నుంచో జరుగుతున్నా ప్రచారం
ఆ దిశలొ పయనించేమా మనమందరం
ఫోషించ గలిగినా మనం బహు సంతానం
ఆ భారం తట్టుకోగలదా మన దేశం

చక్కని పాపాయి ఇంట తిరిగే మధురానుభూతికి
ఒక్కరు చాలు కదా ప్రతి కుటుంబానికి
సమజాన సొదరభావనే ఉంటే నిజానికి
ఉందా మరో సంతానపు అవసరం తోడుకి

ఫ్రతి రంగం లొ స్త్రీ ప్రగతి సాధించినా
ఇంకా సబబా అదపిల్ల అనే యోచన
బొసి నవ్వులు కురిపించరా ఆడ ఐనా మగ ఐనా
మరోసారి మగ శిశువుకై మీరు చేసే ఆలొచన
కాదా మీరు జాతికి చేస్తున్న వంచన

ఎందరో పసిపాపలు అనాధలై ప్రేమ లేమి తో ఉంటే
చేరదీయ రాదే మరొకరిని పోషించే బలమే ఉంటే

నే చెప్పట్లేదు ఇదే అన్ని సమస్యలకీ సమాధానమని
ఐతే ఈ మార్పు తప్పక తగ్గిస్తుంది జాతికి భారాన్ని

vrudhasramam

పిల్ల గాలి చల్లగా అడుగులేస్తూ
చక్కటి పరిమళాలు మోసుకొస్తూ
వరండాలొ మమ్ము చూసి నవ్వుతూ
వెళ్ళిపోతోంది ఒక్కొక్కరిని పలకరిస్తూ

పులకరించాయా సమీరానికి
అలసిపోయిన మా హ్రుదయాలన్నీ
రోజూ మమ్ములని పలకరించటానికి
వచ్చే నేస్తం అదొక్కటేగా అని

ఆరు దశాబ్దాల క్రితపు బాల్యం
గుర్తు చేస్తుంది ఈ వృద్ధాశ్రమం
అప్పుడు స్నేహితులే ప్రపంచం
ఇప్పుడుంది స్నేహితులు మాత్రం

ఇప్పుడిక కొరేదేముంటుంది మేము
పిల్లల సంతోషమే మాకు బలము
అందుకే వారికి మేమెందుకు భారము
ఈ అశ్రమమే ఇక మాకాశ్రయము

ఆ గుర్తుకొస్తారు అప్పుడప్పుడూ
ముద్దుల మనవలు మనవరాండ్రు
విదేశాలకేగుతూ పిల్లలొదిలిన జ్ఞాపకాలు
అవే మాకు ఇక జీవనాధారాలు

ఐతే వింటున్న మీ అందరికీ ఒక చిన్న సలహా
కొడుకులున్నారులే అని వద్దు మీకు ధీమా ఇహ
మారుతున్న లోకం లో బంధాలకి విలువ లేదుగా
గూడలలసి పొయే రోజు వచ్చే లోగా
మీ జాగ్రత్త మీరు పడతారుగా
లేదంటే.. మా అశ్రమం ఉండనే ఉందిగా

varakatam vadiliddam

ఫ్రతి మనిషి జీవితం లో ఒక మధుర ఘట్టం
వివాహ బంధం కలిసే ఆ మధుర క్షణం
రెండు మనసులు పెన వేసుకునే సమయం
రెండు కుటుంబాలు ఒక్కటయ్యే పర్వ దినం

జీవితం పంచుకోబోయేది ఎవరో అన్న నిర్ణయం
జరగాలి మనసుల పొంతన కుదిరిన ప్రకారం
పెళ్ళికొడుకును బేరం పెట్టి చేయు వ్యాపారం
చేసేనా పెళ్ళిని ఒక మధురమైన అనుభవం

పెళ్ళి కూతురు తనతో తేవాలి చక్కటి గుణం
మిగల్చక పుట్టినింటికి అంతులేని రుణం
అత్త మామ ల సొమ్ము కై అశించి బతకటం
ఆనిపించుకుంటుందా ఎన్నడైనా మగతనం

అమ్మ నాన్నల ప్రేమ అత్త మామ చుపేరని
అన్నీ తానై తన వాడు తోడు అవుతాడని
ఆడపడుచు మరుదులు తనకు కొత్త నేస్తాలని
ఆ ఇల్లే తనకిక స్వర్గ సీమ అయ్యేనని

మెట్టినింట అడుగు పెట్టి వచ్చిన ఆ అర్ధాంగిని
ధన దాహపు మైకం లో వళ్ళు మరిచి
శత విధాల బాధించి, ఇహ నరకం చూపించి
ఊపిరి నే హరిస్తోంది మాయదారి పిశాచి

ఇటువంటి జీవితాన మగవారికి సైతం ఉండేనా శాంతి
కన్నవారూ అలొచించండొకసారి ఈ సంగతి
మీ సొదరి కూతురు మనవరాలిదీ ఇదే స్థితి
అందుకే గళం గళం కలిపి కదలాలిక జాతి
వరకట్న పిశాచాన్ని వదిలించాలా క్రాంతి

Thursday, July 12, 2007

HIV Rogi sandesam

మనసు దొంతరల మధ్య ఎక్కడో
నిన్న కలలు కలవర పెదితే
మౌన రాగం ఆలపిస్తూ
మాటలాడే తోడు కోసం
జనారన్యపు నిశ్శబ్దం లొ
వెతుకులాటె బతుకు ఆటగా
సాగిపోతూ నేను జాతికి
అందచేసే సందేశం
ఆగి వింటారా ఒక్క క్షణం

అందమైన యవ్వనం
కోరుకున్న పరిణయం
ఫ్రణయ కలహాలా సాక్షిగా
నవ్వులే పువ్వులై కురవగ
ఫూల దారి సాగేనిక
బతుకు బండి ప్రయాణం

ఆకతాయి కొంటెతనం
క్షణికమైన వ్యామోహం
ఆదుపు తప్పి మనసు చేసె
ఒక్క చిన్న తప్పిదం
ఆయ్యిందో విష కణం
తెలిసిందో చేదు నిజం
ఆదే హెచ్ ఐ వి సోకటం

నన్ను చూసి జాలి వద్దు
నన్ను వేరు చెయ్య వద్దు
కాదు దీనికి సమాధానం
నన్ను మీరు ద్వీషించడం
నా కధ చెప్తొందొక పాఠం
అది తెలుసుకు సాంగించు ప్రయాణం

Chinnarula Avedana

చిట్టి పొట్టి పాపలం
చిరు నవ్వుల జ్యొతులం
ఆట పాటలే మా లొకం
అసూయలను మేమెరుగం

అమ్మ నాన్న ఇద్దరూ ఇంజనీర్లు
ఇద్దరికి ఉన్నాయి మరి కార్లు
ఊన్నాయి మాకు రెందు బంగళాలు
మేము చదివెది ఇంటెర్నేషనల్ స్కూలు
ఆహా అనకండి చెప్తాము అసలు విషయాలు.

పరుగు పెట్టు ఈ పొటీ ప్రపంచం
హరిస్తోంది చక్కని మా బాల్యం
సాయంత్రపు అటలు అయ్యేను మాయం
నిద్ర వేళ కధలు ఇక సూన్యం

ఆమ్మ అంటే మాకిష్టం
అమెకేమో అఫీసే ప్రపంచం
నాన్నె మా తొలి నేస్తం
కానీ కబుర్లకసలేది సమయం

తాతయ్యతొ అటంటే భలె మజా
తానుండెది ఎన్నొ మైళ్ళ దూరంగా
నానమ్మ చెప్తుంది మంచి కధలు
కానీ తనని కలిసేదెప్పుడసలు

వారంతం కోసము మా ఆరటం
అమ్మ నాన్నలని కలిసి చూడు అవకాశం
ఆటకి రమ్మని మేమడిగినా పాపం
వాళ్ళకదే కదా విశ్రాంతి దినం

ఎవరి కోసమిదంతా అని అదిగితే నాన్నని
ఆన్నాడు నీ కోసమేరా కన్నా అని
మా బాల్యం హరించెయ్యమని
ఎవరిచ్చారే అధికారాన్ని

ఎసి గదుల కన్నా కంప్యూటర్ ఆట కన్న
ఆమ్మ నాన్న ఒడే మిన్న
వాళ్ళకీ నిజమెన్నడైన తెలిసేనా
మా పై జాలి కలిగేనా