Saturday, August 4, 2012

Pancha Bhutaalu

పంచ భూతాలు అంటే దయ్యాలు భూతాలూ 
కావనుకుంటున్నారా
ఐతే ఒక మాట చెబుతా వింటారా

గాలి నేల నీరు నింగి నిప్పు దైవాలుగా 
మన జీవన మనుగడకే బాసట గా
ఉంటుంటే విలువ లేక చేసి దగా
ఉసురు తీసి మార్చాముగ భూతాలుగ

మనము పీల్చు గాలి కదా
ఎడా పెడా అందులోకి విష వాయువు
పంపిస్తూ కాలుష్యపు రక్కసికి
బలి చేస్తే భూతమై తిరుగదా
మన ఊపిరి తిత్తులనే గుల్ల చేసి చంపదా

నేల తల్లిగా కొలిచిన భూమాతను సైతం
రక రకాలుగా తవ్వుతూ పొతున్నాం
లోలో పలి పొరల్లోకి వ్యర్ధాలను పంపిస్తూ
భుగర్భన్నే పొట్టన బెట్టుకుని
అణుపరీక్షలవీ ఇవీ అని దహించి వెధిస్తే
కాలం చేసిన నేల తల్లి
ఇక భూతమవదా సహనమొదిలి

నీలాకాశం గొడుగై అతి నీలిలొహిత కిరణాలను
అపుతూ రక్షిస్తుంటే తండ్రి లా మనలను
అభివృద్ధి పేరుతో ఆ విశాల హృదయానికి
తూట్లు పొడిచి ఉసురు తీసి వేధిస్తే
భూతమై గొదుగు నీడ తొలగిస్తే విలయమే కదా

నీటికున్న పవిత్రతను మరిచి
చెరువులన్ని ఆక్రమించి సౌధాలను నిర్మించి
నదులన్నీ మురుగునీటి ఆవాసాలుగ చేసి
లోలోపలి నీరంతా బొరులతో తవ్వేసి
ఆయువు తీసేస్తుంటే నీరు భూతమై
దూరమైతే మనగలమా దానిని వదిలేసి

వెలుగునిచ్చే జ్యొతియై
చలిని కాచే నేస్తమై
తోడు ఉన్న నిప్పునే నిర్లక్ష్యం చేస్తే
ఆగ్రహించి తను భూతమై
చేయదా పెను విధ్వంసం

దైవత్వం తో మనకొసమే ఉన్న
పంచ భూతాలని క్షేమంగా ఉంచుకుందాం
మనకీ మన పిల్లలకీ అవి
భూతాలుగా అవకుండా మేలుకుందాం

nedu

ఎందుకోసమో తెలియదు ఎంత దూరమో తెలియదు
పరుగు తీస్తూ పడుతూ లేస్తూ ఆగమన్నా ఆగదు
ఉరకలేస్తూ వెర్రిగా పోతోంది మన బతుకు బండి 
గమ్యాలు లక్ష్యాలు ఆస్తులు పాస్తులు ఇవేనా జీవితమంటే
రేపటిని చేరుకునే పరుగులో నిన్నటిని దిద్దుకునే గోలలొ
నిత్యం నలిగిపొయే "నేడు" బతిమలాడుతోంది ఒక్కసారి 
పరుగు ఆపి నన్ను చూడమంటూ నా చెలిమి చేయమంటూ 

చిన్న చిన్న అనందాలన్నిటినీ వదిలి పెట్టి 
పెద్ద మేడ కట్టి గొప్ప విలాసంగ ఉందామని 
పైస పైస కూడ బెట్టి పగలు రాత్రి మరిచిపొయి
సుదూరాన విడి విడిగా ఉంటు కష్టపడుతూ
నేడన్నది మరిచిపోయి రేపు తలచుకుంటూ
ఆలు మగలు కట్టుకున్న కలల మేడ కింద 
నలిగిపోతు మూగగా అరుస్తోంది "నేదు" 

ఐశ్వర్యం హోదా గుర్తింపే లక్ష్యం గా
నీతీ నిజాయితీ నీడైనా తగల కుండా 
కన్నవారు తొబుట్టువులైన పట్టకుండా
తొటివారిని తోసుకుంటూ ముందుకు దూకి
రాబొయే సంతోషం తలచుకుంటు బ్రతుకుతూ
సాగించే జీవితంలో ప్రతి మెట్టు కిందా నలిగి 
భారం మోయలేక బాధ పడుతోంది "నేడు"

నిత్యం నీతో ఉండే నీ నేస్తం "నేడు"
ఎన్నొ అనందాల నిధి దాచుకుంది "నేడు"
ఎన్నొ అనుబంధాల గుభాలింపులున్న "నేడు"
చిన్నబోద పట్టకుంద వదిలెస్తే ఈ రేపు నిన్న గోలలో
అందుకే "నేడు" ఒక పండగలా ఉందాము హాయిగా