Friday, August 17, 2007

60 years of independence !!!!

ఆరు దశాబ్దాల భారత స్వరాజ్యం
సంబరాలు చేశాము వాడ వాడలా మనం
ఏమిటీ సాధించిన స్వాతంత్ర్యానికి అర్ధం
ఏనాడైనా ఆలోచించామా ఒక్క క్షణం

విభజించి పాలించారని చరిత్ర లో చదివాం
ఈ నాటి రాజకీయానిదీ మరి అదే చందం
ఈ వర్గం ఆ ప్రాంతం ఈ కులం ఆ మతం
ఇవేగా నేటి రాజకీయాల నిజమైన స్వరూపం
విభేదాలు మరచి ఒక్కటయ్యామా మనం

తెల్లవారిని తరిమి కొట్టిన సత్యాగ్రహం
కొత్త పుంతలు తొక్కుతోందిప్పుడు నిజం
విధ్వంసం సృష్ఠించె ఉద్యమాల పర్వం
బందులంటు మొదలైన వింత సంప్రదాయం
ఇదేనా ఇంటి సమస్యలు తీర్చుకునే విధానం

భావ స్వాతంత్ర్యం ఒక గొప్ప వరం
జన జాగృతికీ అభ్యుదయానికీ ఆయుధం
చట్ట సభలలో నాయకుల పదజాలం
విలువలు శూన్యమైన ఈ నాటి జర్నలిజం
ఇదా ఆ హక్కుని వాడుకునే విధానం

పాశ్త్యాత్యపు మోజులో పడి విచ్చల విడి తనం
నేర్చుకున్నాము గానీ త్వర త్వరగా మనం
క్రమశిక్షణ గుణం జవాబు దారి తనం
వారి నుంచి నేర్వగలిగామా మనమందరం
ఇదా మన స్వాతంత్ర్యాన్ని అనుభవించు విధానం

హక్కులకై నినందించే ప్రతి ఒక్క గళం
ఇది బాధ్యతలను గుర్తించాల్సిన తరుణం
ఇదే కదా స్వతంత్ర భారతికి ఈ దినం
మనమందించే వజ్రొత్సవ నీరాజనం
సగర్వంగ ఎగిరేనపుడు మన త్రివర్ణ పతాకం

2 comments:

Krishna B said...

hi subbu,

excellent kavitha . i did not know you had this level of talent in you. you should send this for publishing in magazines. my sincere appreciation for sharing this good kavithvam with me using a blog.

Unknown said...

అద్భుత౦!!!నిజ్జమ్గా......నిజ్జమ్....గా......