Saturday, August 18, 2007

ఇదా మన దేశం

ఇదా మన దేశం ఇదా మన దేశం
నేతాజీ కలలు కన్న భారత దేశం
శివాజీ ప్రతాపులు పుట్టిన దేశం
నాగరికత విశ్వానికి నేర్పిన దేశం

ప్రతి పనిలొ పెరుగుతున్న అవినీతి
మది మది లొ నిండి ఉన్న అశాంతి
సందు సందులొ లెక్క లేని దొమ్మీలు
ఇంటి ఇంటి లో చెప్పలేని కలహాలు
ఇదా మన దేశం ఇదా మన దేశం

యువతలొ సినిమాల జ్వరం
అనాగరిక వర్తనకది కారణం
పసిపిల్లల చెతులకు పని దాస్యం
అది భావి తరాలకు తీరని ద్రోహం
క్రీడల్లో కనిపించని సమరోత్సాహం
చిన్న గెలుపుతోనే అలసత్వం
దేశ రక్షణ లోనూ వస్తున్న జాడ్యం
ఇది దేశ మాత క్షమించని నేరం
ఇదా మన దేశం ఇదా మన దేశం

కుల మత్తులొ జోగేది కొందరు
మత పిచ్చి లోకంగా కొందరు
ప్రాంత వైషమ్యాలే ఊపిరిగా కొందరు
ఒకే తల్లి బిడ్డలమని ఎపుడు తెలుసుకుంటారు
దేశాన్ని దూషించే ప్రభుధ్ధులు కొందరు
దేశమొదిలి వెళ్ళిపోవు మేధావులు కొందరు
దేశ సేవ బరువని వదిలెసేదెందరో
ఇదా మన దేశం ఇదా మన దేశం

ఇకనైనా నిదుర వదిలి
యువ శక్తి ముందు కదిలి
చేయి చేయి కలిపి నదిచి
దేశమాత రుణం తీర్చి
స్వర్ణ యుగం సాధించి
గర్వంగా చెబుదాము
ఇదే మన దేశం ఇదే మన దేశం
జగద్గురువు మన భారత దేశం

No comments: