Friday, July 13, 2007

vrudhasramam

పిల్ల గాలి చల్లగా అడుగులేస్తూ
చక్కటి పరిమళాలు మోసుకొస్తూ
వరండాలొ మమ్ము చూసి నవ్వుతూ
వెళ్ళిపోతోంది ఒక్కొక్కరిని పలకరిస్తూ

పులకరించాయా సమీరానికి
అలసిపోయిన మా హ్రుదయాలన్నీ
రోజూ మమ్ములని పలకరించటానికి
వచ్చే నేస్తం అదొక్కటేగా అని

ఆరు దశాబ్దాల క్రితపు బాల్యం
గుర్తు చేస్తుంది ఈ వృద్ధాశ్రమం
అప్పుడు స్నేహితులే ప్రపంచం
ఇప్పుడుంది స్నేహితులు మాత్రం

ఇప్పుడిక కొరేదేముంటుంది మేము
పిల్లల సంతోషమే మాకు బలము
అందుకే వారికి మేమెందుకు భారము
ఈ అశ్రమమే ఇక మాకాశ్రయము

ఆ గుర్తుకొస్తారు అప్పుడప్పుడూ
ముద్దుల మనవలు మనవరాండ్రు
విదేశాలకేగుతూ పిల్లలొదిలిన జ్ఞాపకాలు
అవే మాకు ఇక జీవనాధారాలు

ఐతే వింటున్న మీ అందరికీ ఒక చిన్న సలహా
కొడుకులున్నారులే అని వద్దు మీకు ధీమా ఇహ
మారుతున్న లోకం లో బంధాలకి విలువ లేదుగా
గూడలలసి పొయే రోజు వచ్చే లోగా
మీ జాగ్రత్త మీరు పడతారుగా
లేదంటే.. మా అశ్రమం ఉండనే ఉందిగా

1 comment:

SriLakshmi said...

Manasuni Kadilinchindi

Srilu,
Prassu.